Good news for the people of AP.. CM Jagan has unveiled the welfare calendar.. In which months will you need money?
AP Government Welfare Calendar 2023-24 has been unveiled by Chief Minister CM Jagan for the year 2023-24.
State Information Minister Srinivasa Venugopalakrishna and Information Commissioner Tumma Vijaykumar Reddy participated in the program held on Tuesday at the CM's camp office in Tadepalli. On this occasion, Minister Chelloboin said that within 45 months of Jagan's government coming to power, 2,96,148.09 crore rupees have been provided to the beneficiaries through various welfare schemes. Later, CM Jagan unveiled the calendar containing the details of various welfare schemes and the funds allocated for the year 2023-24.
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. సంక్షేమ క్యాలెండర్ ఆవిష్కరించిన సీఎం జగన్.. మీకు ఏయే నెలల్లో డబ్బు పడుతుందంటే?
2023-24 సంవత్సరానికి సంబంధించి ఏపీ ప్రభుత్వ సంక్షేమ క్యాలెండర్ 2023-24 ను రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్ ఆవిష్కరించారు.
తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, సమాచార శాఖ కమిషనర్ తుమ్మా విజయ్‌కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 45 నెలల్లోనే వివిధ సంక్షేమ పథకాల ద్వారా 2,96,148.09 కోట్ల రూపాయలను లబ్ధిదారులకు అందించామన్నారు మంత్రి చెల్లుబోయిన. అనంతరం 2023-24 సంవత్సరానికి సంబంధించి వివిధ సంక్షేమ పథకాలు, వాటికి కేటాయించిన నిధుల వివరాలను పొందు పరచిన క్యాలెండర్‌ను సీఎం జగన్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.
ఏప్రిల్ 2023 - జగనన్న వసతి దీవెన, వైఎస్సార్ ఈబీసీ నేస్తం
మే 2023 - వైఎస్సార్ రైతు భరోసా - పీఎం కిసాన్ (మొదటి విడత), వైఎస్సార్ ఉచిత పంటల బీమా, జగనన్న విద్యాదీవెన(మొదటి విడత), వైఎస్సార్ కళ్యాణమస్తు-షాదీ తోఫా (మొదటి త్రైమాసికం), వైఎస్సార్ మత్స్యకార భరోసా
జూన్ 2023 - జగనన్న విద్యా కానుక, జగనన్న అమ్మ ఒడి, వైఎస్సార్ లా నేస్తం (మొదటి విడత), మిగిలిపోయిన లబ్ధిదారులకు లబ్ధి
జులై 2023 - జగనన్న విదేశీ విద్యా దీవెన (మొదటి విడత), వైఎస్సార్ నేతన్న నేస్తం, ఎంఎస్‌ఎంఈ ప్రోత్సాహకాలు, జగనన్న తోడు (మొదటి విడత), వైఎస్సార్ సున్నా వడ్డీ (ఎస్‌హెచ్‌జీ), వైఎస్సార్ కళ్యాణమస్తు-షాదీ తోఫా (రెండో త్రైమాసికం)
ఆగష్టు 2023 - జగనన్న విద్యా దీవెన (రెండో విడత), వైఎస్సార్ కాపు నేస్తం, వైఎస్సార్ వాహనమిత్ర
సెప్టెంబర్ 2023 - వైఎస్సార్ చేయూత
అక్టోబర్ 2023 - వైఎస్సార్ రైతుభరోసా - పీఎం కిసాన్ (రెండో విడత), జగనన్న వసతి దీవెన (మొదటి విడత)
నవంబర్ 2023 - వైఎస్సార్ సున్నావడ్డీ - పంట రుణాలు, వైఎస్సార్ కళ్యాణమస్తు-షాదీతోఫా (మూడవ త్రైమాసికం), జగనన్న విద్యాదీవెన (మూడో విడత)
డిసెంబర్ 2023 - జగనన్న విదేశీ విద్యాదీవెన (రెండవ విడత), జగనన్న చేదోడు, మిగిలిపోయిన లబ్ధిదారులకు లబ్ధి
జనవరి 2024 - వైఎస్సార్ రైతుభరోసా - పీఎం కిసాన్ (మూడవ విడత), వైఎస్సార్ ఆసరా, జగనన్న తోడు (రెండవ విడత),వైఎస్సార్ లా నేస్తం (రెండవ విడత), పెన్షన్ల పెంపు (నెలకు రూ. 3000)
ఫిబ్రవరి 2024 - జగనన్న విద్యా దీవెన (నాల్గవ విడత), వైఎస్సార్ కళ్యాణమస్తు-షా దీతోఫా (నాలుగో త్రైమాసికం), వైఎస్సార్ ఈబీసీ నేస్తం
మార్చి 2024 - జగనన్న వసతి దీవెన (రెండవ విడత), ఎంఎస్‌ఎంఈ ప్రోత్సాహకాలు