BHEL Recruitment 2023: ఇంజనీరింగ్‌ నిరుద్యోగులకు సదావకాశం.. రాతపరీక్షలేకుండా బీహెచ్‌ఈఎల్‌లో ఉద్యోగాలు..

 BHEL Recruitment 2023: Opportunities for engineering unemployed.. Jobs in BHEL without written exam..

BHEL Recruitment 2023:

Bharat Heavy Electricals Limited, Bangalore, under the Ministry of Heavy Industries, Government of India, has released a notification seeking applications from eligible candidates for filling up 10 Project Supervisor posts.

Anyone who has passed BE/B.Tech degree or equivalent course with minimum 60% marks in Electrical/Electronics disciplines can apply.

BHEL Recruitment 2023: ఇంజనీరింగ్‌ నిరుద్యోగులకు సదావకాశం.. రాతపరీక్షలేకుండా బీహెచ్‌ఈఎల్‌లో ఉద్యోగాలు..

భారత ప్రభుత్వ భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన బెంగళూరులోని భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్‌ .. 10 ప్రాజెక్ట్ సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఎలక్ట్రికల్‌/ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించిన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. 

అలాగే సంబంధిత పనిలో ఏడాది అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 32 ఏళ్లకు మించకుండా ఉండాలి.

ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో ఏప్రిల్‌ 29, 2022వ తేదీ రాత్రి 8 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. 

అనంతరం నింపిన దరఖాస్తులను డౌన్‌లోడ్‌ చేసుకుని కింది అడ్రస్‌కు మే 6వ తేదీలోపు పోస్టు ద్వారా పంపించవల్సి ఉంటుంది. 

దరఖాస్తు సమయంలో జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ అభ్యర్ధులు రూ.200లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/ఎక్స్ సర్వీస్‌మెన్‌ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. 

ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.43,550ల వరకు జీతంగా చెల్లిస్తారు. జీతంతోపాటు ఇతర అలవెన్సులు కూడా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

అడ్రస్..

AGM (HR), Bharat Heavy Electricals Limited, Electronics Division, P. B. No. 2606, Mysore Road, Bengaluru-560026.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.