Air Conditioner : ఏసీల్లో ఎక్కువ సమయం గడుపుతున్నారా ? అయితే ఎంత నష్టమో తెలుసుకోగలరు.

 Air Conditioner: Do you spend a lot of time in AC? But you can know how much loss.

Air Conditioner: Do you spend a lot of time in AC? But you can know how much loss.

No matter the season, some people have to turn on the AC before going to bed. Otherwise they cannot sleep. Doctors say that it is not good to get used to AC environment like this in offices and at home.

Air Conditioner : ఏసీల్లో ఎక్కువ సమయం గడుపుతున్నారా ? అయితే ఎంత నష్టమో తెలుసుకోగలరు.

కాలం ఏదైనా సరే కొంతమంది పడుకునే ముందు ఏసీ వేసుకోవల్సిందే. లేదంటే వారికి నిద్రపట్టదు. ఆఫీసుల్లో, ఇంట్లో ఇలా ఏసీ వాతావరణానికి అలవాటు పడటం మంచిది కాదంటున్నారు వైద్యులు.

ఎయిర్‌ కండిషనర్స్‌తో ఆరోగ్యపరంగా కొన్ని ప్రయోజనాలతో పాటు కొన్ని నష్టాలు కూడా ఉంటాయి. ఏసీల ద్వారా వచ్చే ఆర్టిఫిషియల్ కూల్ ఎయిర్ మన జుట్టుకి, చర్మానికి చాలా హాని చేస్తుంది. అంతేకాదు స్కిన్ ఎండిపోవడం, పెదాలు పగలడానికి, ఒళ్లు నొప్పులు రావడానికి కూడా ఏసీలే కారణం. ఈ ఏసీల వల్ల ఇంకా ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

* చర్మం డ్రైగా మారడం వల్ల ముడదలు వస్తాయి. రోజంతా ఏసీలలో గడిపే వాళ్ల శరీరం న్యాచురల్ సెబమ్‌ను ఉత్పత్తి చేయలేదు. దీనివల్ల చర్మం డీహైడ్రేట్‌కి గురవుతుంది. చర్మం మాయిశ్చరైజర్‌ని కోల్పోవడం వల్ల.. ముడతలు, ఫైన్ లైన్స్ ఏర్పడతాయి.

* సోరియాసిస్, ఎగ్జిమా, సియానొసిస్ వంటి సమస్యలతో బాధపడేవాళ్లు ఏసీలలో గడిపితే ఆ లక్షణాలు మరింత ఎక్కువ అవుతాయి. సమస్య మరింత ఇబ్బంది పెడుతుంది.

* ఏసీల నుంచి వచ్చే గాలి వల్ల పెదాలు డ్రైగా మారి పగులుతాయి. హైడ్రేటెడ్ స్కిన్ దీనికి ప్రధాన కారణం.

* ఏసీల వల్ల చర్మమే కాదు జట్టు కూడా డ్రైగా మారుతుంది. ఏసీ రూమ్‌లో ఉంటూ ఏదో పని మీద బయటకు వెళ్తూ ఉంటారు కొందరు. ఇలాంటి వారు ఒకే సారి చల్లటి ప్రదేశం నుంచి వేడిలోకి, వేడిలో నుంచి ఒకేసారి చల్లటి ప్రదేశంలోకి వస్తారు. దీనివల్ల జుట్టు డ్రైగా మారుతుంది. దీంతో చుండ్రు, తలలో దురద సమస్యలు ఎదురవుతాయి.

ఎక్కువగా ఏసీల్లో గడిపే వారిలో కార్డియో వ్యాస్కులర్ సమస్యలు, శ్వాస కోశ సమస్యలైన ఆస్థమా, పిల్లి కూతలు రావచ్చు. ఏసీ వల్ల ఒక రకం నిమోనియా అయిన లెజియోన్నేరిస్‌ వంటి వ్యాధులూ వచ్చే అవకాశం ఉంది. ఏసీలో ఎక్కువ గడిపే వారు సరిగ్గా నీళ్లు తాగరు. దీంతో వారికి కిడ్నీలో స్టోన్స్‌ ఏర్పడవచ్చు. చర్మంపై దురదలు, తరచుగా తలనొప్పి, అలసట వంటి సమస్యలు ఎదుర్కొంటారు. నిత్యం ఏసిల్లో గడిపే వారిలో భవిష్యత్తులో వివిధ రకాల సమస్యలు వారిని చుట్టుముట్టే అవకాశాలు అధికంగా ఉంటాయంటున్నారు నిపుణులు.

అయితే కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే.. ఏసీల వల్ల చర్మం, జుట్టుకి కలిగే నష్టాలను అరికట్టవచ్చు.

* ప్రతిరోజూ 8 గ్లాసుల నీళ్లు తాగడం వల్ల చర్మం మాయిశ్చరైజర్‌ని కోల్పోకుండా ఉంటుంది.

* ముఖానికి, చేతులు, శరీరానికి హైడ్రేటింగ్ క్రీం తప్పనిసరిగా అప్లై చేయాలి.

* ఎండ తీవ్రంగా ఉన్న సమయంలో తప్ప ఇతర సమయాల్లో సాధారణ వాతావరణంలో గడపటానికే ఆసక్తి చూపాలి.

* ఏసీలోని ఫిల్టర్స్‌ తరచూ శుభ్రపరుస్తూ ఉండాలి. ఫిల్టర్స్‌ను సబ్బుతో కడగాల్సి వచ్చినప్పుడు అవి ఆరోగ్యంపై దుష్ప్రభావాలు చూపించకుండా ఉంటాయి. అత్యవసర వినియోగానికి తప్ప ఏసిలను వాడకపోవటమే మంచిది.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.