Aadhaar Pan Link: Good News. No need to link Aadhaar PAN card. Center for them!
Pan Card Pan Card Aadhaar Card Link must be done correctly. It will expire at the end of March. But according to the central notification, some people are exempted from this.
Those who have Aadhaar Card PAN card have to complete one task for sure. The same PAN card should be linked with Aadhaar card. The deadline for this is also near. You have to complete this task by March 31. Otherwise the PAN card is not valid.
Aadhaar Pan Link: గుడ్ న్యూస్. ఆధార్ పాన్ కార్డు లింక్ చేసుకోవాల్సిన పని లేదు. వారికి కేంద్రం ఊరట!
Pan Card పాన్ కార్డు ఆధార్ కార్డ్ లింక్ కచ్చితంగా చేసుకోవాల్సిందే. దీనికి మార్చి నెలాఖరుతో గడువు ముగుస్తుంది. అయితే కేం్దరం నోటిఫికేషన్ ప్రకారం చూస్తే.. కొందరికి దీని నుంచి మినహాయింపు ఉంది.
Aadhaar Card పాన్ కార్డు కలిగిన వారు కచ్చితంగా ఒక పని పూర్తి చేసుకోవాల్సిందే. అదే పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాలి. దీనికి గడువు కూడా దగ్గరిలోనే ఉంది. మార్చి 31లోపు మీరు ఈ పని పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే మాత్రం పాన్ కార్డు చెల్లుబాటు కాదు.
ఒకవేళ మార్చి 31లోపు ఆధార్ పాన్ కార్డును లింక్ చేసుకోకపోతే మాత్రం ఇబ్బందులు తప్పవు. పాన్ కార్డు చెల్లదు. దీంతో చాలా చోట్ల మీరు పాన్ కార్డు ఇచ్చి ఉంటారు. ఇవ్వాల్సి కూడా ఉంటుంది. అప్పుడు ఇబ్బంది ఎదురు కావొచ్చు. అలాగే పెనాల్టీ రూ. 1000 పడుతుంది.
అయితే కొన్ని పరిస్థితుల్లో పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాల్సిన పని లేదు. ఎవరెవరికి పాన్ ఆధార్ లింక్ నుంచి మిహాయింపు ఉందో తెలుసుకోండి.
గవర్నమెంట్ నోటిఫికేషన్ ప్రకారం చూస్తే.. నాన్ రెసిడెంట్ ఇండియన్స్ (ఎన్ఆర్ఐ)కు పాన్ ఆధార్ కార్డులను లింక్ చేసుకోవాల్సిన పని లేదు. అందువల్ల మీరు ఎన్ఆర్ఐ అయితే పాన్ కార్డు ఆధార్ కార్డు లింక్ చేసుకోవాల్సిన పని లేదు.
80 ఏళ్లకు పైన వయసు కలిగిన వారు కూడా పాన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోవాల్సిన పని లేదు. కేంద్ర ప్రభుత్వం సూపర్ సీనియర్ సిటిజన్స్‌కు ఊరట కలిగించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
అస్సాం, మేఘాలయా, జమ్మూ కశ్మీర్ వంటి ప్రాంతాల్లో నివసించే వారు కూడా పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోకూడదు. ఆయా రాష్ట్రాల్లోని ప్రత్యేక పరిస్థితుల కారణంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
నాన్ ఇండివీజువల్ ఎన్‌టిటీస్ అంటే కంపెనీలు, సంస్థలు, ట్రస్టులు వంటి వాటికి కూడా పాన్ ఆధార్ కార్డు లింక్ అవసరం లేదు. కేవలం వ్యక్తులు మాత్రమే కచ్చితంగా పాన్ ఆధార్ లింక్ చేసుకోవాల్సిందే.
అందువల్ల మీరు పాన్ కార్డు కలిగి ఉంటే.. పైన పేర్కొన్న విభాగాలకు చెంది ఉంటే.. పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాల్సిన పని లేదు. అయితే వ్యక్తులు మాత్రం కచ్చితంగా పాన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోవాల్సిందే. లేదంటే మాత్రం ఇబ్బందులు తప్పవు. పెనాల్టీ పడుతుంది. అలాగే పాన్ కార్డు పని చేయదు.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చాలా సార్లు పాన్ ఆధార్ కార్డుల లింక్‌కు చాలా సార్లు గడువు పొడిగిస్తూ వచ్చింది. అలాగే రేషన్ కార్డు, ఓటర్ కార్డులతో ఆధార్ లింక్ గడువు కూడా ఇటీవలనే ఎక్స్‌టెండ్ చేసింది .ఈ క్రమంలో పాన్ ఆధార్ డెడ్‌లైన్ పొడిగింపు కూడా ఉండొచ్చని కొంత మంది అంచనా వేస్తున్నారు. అయితే కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.