Let's find out how beneficial night walking is for health.
Many people go to bed immediately after dinner. It does not mean that you fall asleep immediately after getting into bed. That's why doctors say that many health problems will not arise if you walk for fun in this free time. Generally, if we eat a full stomach of the food we like, our whole body goes into a kind of intoxication. But this habit should be avoided. Experts say that otherwise there is a risk of acidity and heart attack. About 30 thousand researchers from America have revealed interesting things in the research.
నైట్ వాకింగ్ ఆరోగ్యానికి ఎంతటి ఉపయోగదాయకమో తెలుసుకుందాం.
రాత్రి తిన్న వెంటనే చాలా మంది నిద్రపోదామని పడక ఎక్కుతారు. బెడ్ ఎక్కిన తర్వాత వెంటనే నిద్ర పోతారా అంటే అది లేదు. అందుకే ఈ ఖాళీ సమయంలో సరదాగా అలా వాకింగ్ చేస్తే చాలా అనారోగ్య సమస్యలు దరిచేరవని వైద్యులు అంటున్నారు. సాధారణంగా మనసుకు నచ్చిన ఆహారం కడుపు నిండా తింటే మన బాడీ అంతా ఒక రకమైన మత్తు లోకి వెళ్లి పోతుంది. కానీ ఈ అలవాటును దూరం చేసుకోవాలి. లేకపోతే అసిడిటీ, హార్ట్ ఎటాక్ లాంటి వాటి బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. అమెరికాకు చెందిన పరిశోధకులు సుమారు 30 వేల మంది చేసిన పరిశోధనలో ఆసక్తికర విషయాలు వెల్లడి అయ్యాయి.
భోజనం చేసిన కొద్ది సేపటి తరువాత నడిస్తే మన శరీరంలో బద్దకం తగ్గుతుంది.
అంతే కాకుండా జీర్ణ వ్యవస్థ చురుగ్గా పని చేస్తుంది. తిన్న తర్వాత సుమారు 15 నిమిషాల నుంచి అర గంట వరకు నడవడం ద్వారా గుండె సంబంధిత రోగాలు కూడా దూరంగా ఉండవచ్చు. తిన్న తర్వాత చేసే వాకింగ్ అనేది ఎలా పడితే అలా చేయకూడదు. ఎందుకంటే భోజనం అయిన తర్వాత పొట్ట అంతా నిండుగా ఉంటుంది. ఆ సమయంలో స్పీడ్ వాక్ చేయడం వల్ల వాంతులు, కడుపులో తిప్పినట్లు అనిపిస్తాయి.
అందుకే చాలా చిన్నగా మనం ఇంట్లో ఎలా అయితే తిరుగుతామో అచ్చం అలా తిరగాలని నిపుణులు సూచిస్తున్నారు. పెళ్లి అయిన వాళ్లు సరదాగా భార్యతో కలిసి మాట్లాడుకుంటూ తిరగడం వల్ల వారి ఆరోగ్యం మంచిగా ఉండటమే కాకుండా.. ఒకరి మాట ఒకరు విని బంధంగా మరింత ధృడ పడే అవకాశం ఉంది. కొత్తగా అలవాటు చేసుకునే వారు తొలుత 5 నిమిషాలు నడవాలి అని లక్ష్యంగా పెట్టుకుని నడవాలి. ఇలా చేయడం వల్ల శరీరాన్ని ఈ నొప్పి అనేది తెలియకుండా కొత్త ప్రక్రియకు అలవాటు చేసిన వారిని అవుతాము.
తిన్న తర్వాత తిరగడం అనేది కేవలం మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో మాత్రమే వర్తిస్తుంది. ఇలా నడకను ప్రారంభించడం వల్ల మలబద్ధక సమస్య కూడా అంతమవుతుంది. మధుమేహం ఉన్న వాళ్లు అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ వీటిని తప్పక పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ తేలికపాటి వాకింగ్ తో జీవక్రియ సరిగా పని చేయడం ప్రారంభించి కొవ్వు కణాలను కరిగించడంలో సాయపడుతుంది. రోజుకు రెండు పూట్ల 5 నుండి 10 నిమిషాల పాటు ఇలా చేయడంతో ఆరోగ్యంగా, ఆనందంగా ఉండొచ్చు.