To speak English well do these
Talk to peers as much as possible in English.
While traveling in buses and trains, you should try to translate as many sentences as possible into English in your mind.
While watching a Telugu movie in a cinema hall or on TV there | The following dialogues should be changed into English in mind.
ఇంగ్లీషులో బాగా మాట్లాడాలంటే . . .
తోటివారితో సాధ్యమైనంత వరకు ఇంగ్లీష్ లో మాట్లాడాలి .
బస్సుల్లో , రైళ్ళల్లో ప్రయాణించేటప్పుడు సహ ప్రయాణీకులు మాట్లాడుకునే మాటలను మనస్సులోనే వీలైనన్ని వాక్యాలను ఇంగ్లీషులోకి తర్జుమా చేయడానికి ప్రయత్నించాలి .
తెలుగు సినిమాను సినిమా హాలులో లేదా టివిలో చూస్తున్నప్పుడు అక్కడ | వచ్చే డైలాగులను ఇంగ్లీషులోకి మనస్సులోనే మార్చాలి .
సభలు , సమావేశాలు , మీటింగులు మరియు గుంపులుగా చేరి జనాలు మాట్లాడే సందర్భాలలో ఊరికినే కూర్చోక సాధ్యమైనన్ని తెలుగులో మాట్లాడే మాటలను ఇంగ్లీష్లోనికి మార్చండి .
ఇంగ్లీష్ లో మాట్లాడే సందర్భాలలో వచ్చే సందేహాలను ఒక పేపర్ మీద వ్రాసుకొని ఎవరైనా ఇంగ్లీష్ టీచరును లేదా ఇంగ్లీష్ బాగా వచ్చిన స్నేహితుని అడిగైనా సందేహాలను నివృత్తి చేసుకోవాలి .
చందమామ కథల పుస్తకాలను ( ఇంగ్లీషు & తెలుగు ) కొని మొదటగా తెలుగు చందమామలో ఒక కథ చదివి ఆ తరువాత ఇంగ్లీష్ చందమామలో ఆ కథను చదవాలి . ఇలా రోజూ ఒక కథను చదవడం ద్వారా ఇంగ్లీష్ గ్రామర్ వస్తుంది .
స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు ప్రారంభంలోనే గ్రామర్ పుస్తకాలు చదవవద్దు .
ఇంగ్లీష్ లో మాట్లాడేటప్పుడు గ్రామర్ రూల్స్ గుర్తు తెచ్చుకోవద్దు .
రకరకాల ఆంగ్ల వాక్యాలను తెలుగు అర్థాలతో సహా మాట్లాడడము అభ్యసించండి .
మీరు మాట్లాడే సమయంలో గ్రామర్ రూల్స్ తెచ్చుకొని మాట్లాడుతున్నంత వరకు మీకు ఇంగ్లీషులో మాట్లాడడంరాదు . గుర్తుంచుకోండి .
ఇంగ్లీష్ వాక్యాలను వినడం మీద దృష్టిని కేంద్రీకరించండి .
ఇంట్లో ఉన్న 3వ తరగతిగానీ ఆపై తరగతి చదివే మీ పిల్లలతో మరియు ప్రక ఇంటివారి పిల్లలతో ఇంగ్లీష్లో మాట్లాడడం ప్రారంభించండి .