Inquiry on the posting of a teacher who has not come for 20 years. Actions by the officers with the orders of the CMO
Inquiry on the posting of a teacher who has not come for 20 years.
Actions by the officers with the orders of the CMO
The authorities have ordered an inquiry into the incident where a teacher was posted despite being absent from duty for the past 20 years.
20ఏళ్లుగా రాని టీచర్‌కు పోస్టింగ్‌పై విచారణ. సీఎంవో ఆదేశాలతో అధికారుల చర్యలు
20ఏళ్లుగా రాని టీచర్‌కు పోస్టింగ్‌పై విచారణ.
సీఎంవో ఆదేశాలతో అధికారుల చర్యలు
గత 20 ఏళ్లుగా విధులకు గైర్హాజరైనా ఓ టీచర్‌కు పోస్టింగ్ ఇచ్చిన సంఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు.
ఈ విషయంపై ముఖ్యమంత్రి కార్యాలయం, విద్యాశాఖ మంత్రి ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగారు. ఈ విచారణ నివేదిక అందిన వెంటనే చర్యల్ని తీసుకోవాలని భావిస్తున్నారు. ''20 ఏళ్లుగా విధులకు గైర్హాజరైనా.. ఆ ఉపాధ్యాయుడికి పోస్టింగ్!'' పేరుతో సోమవారం 'ఆంధ్రజ్యోతి'లో ప్రత్యేక కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే.
అలాగే.. ఐదేళ్లుగా సెలవుల్లో ఉన్న టీచర్లకు జీతం చెల్లించడం వంటి ఘటనలపై కథనంలో పేర్కొనడం జరిగింది. దీనిపై స్పందించిన సీఎంవో, విద్యాశాఖ మంత్రి విచారణకు అధికారులకు ఆదేశించినట్టు తెలిసింది. దీంతో ఉన్నతాధికారులు ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. ఇలాంటి పోస్టింగ్‌లపై నివేదికను సమర్పించాల్సిందిగా సంబంధిత జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ నివేదిక అందిన వెంటనే చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు.