100 Junior Assistant cum Computer Operator Posts in TSN PDCL - Salary Allowances: Rs.29,255 - Rs.54,380 per month.
Uttara Telangana Power Distribution Corporation (NPDCL) has released a notification to fill up 100 Junior Assistant cum Computer Operator vacancies. These appointments will be made on regular basis.
టీఎస్ఎన్ పీడీసీఎల్ లో 100 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు - జీత భత్యాలు: నెలకు రూ.29,255 - రూ.54,380.
వరంగల్ కేంద్రంగా పనిచేస్తున్న ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్) లో ఖాళీగా ఉన్న 100 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. రెగ్యులర్ ప్రాతిపదికన ఈ నియామకాలు చేపట్టనున్నారు.
విద్యుత్ సర్కిళ్లు: వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్.
జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్: 100 పోస్టులు
అర్హత: బీఏ, బీఎస్సీ, బీకాంతో పాటు కంప్యూటర్ అప్లికేషన్/ ఆఫీస్ ఆటోమేషన్ (ఎంఎస్ ఆఫీస్) సర్టిఫికెట్ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు: 01.01.2023 నాటికి 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీత భత్యాలు: నెలకు రూ.29,255 - రూ.54,380 .
ఎంపిక విధానం: రాత పరీక్ష(80 మార్కులు), సంబంధిత అనుభవం (20 మార్కులు), ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు రుసుము: రూ.320 (ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్మెన్ అభ్యర్థులకు పరీక్ష రుసుము చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది).
ముఖ్యమైన తేదీలు. . .
దరఖాస్తు సమర్పణ, ఫీజు చెల్లింపు ప్రారంభం: 10-04-2023.
దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 29-04-2023.
దరఖాస్తు సవరణ తేదీలు: 02-05-2023 నుంచి 05-05-2023 వరకు.
హాల్ టిక్కెట్ ల డౌన్లోడ్ ప్రారంభం: 22-05-2023 .
రాత పరీక్ష తేదీ: 28-05-2023.