EGG:గుడ్డుతో గుండెపోటుకు చెక్.ఎలా సాధ్యం.2023

 EGG: Check for heart attack with egg. How possible.

EGG: Check for heart attack with egg. How possible.

chicken egg Foods that are strictly prescribed by doctors for good health. But there are various theories about the egg. While some say that egg is harmful to health

Many say to consume eggs at least three times a week. How is egg good for health? How is egg useful in improving heart function..?

EGG:గుడ్డుతో గుండెపోటుకు చెక్.ఎలా సాధ్యం.

కోడి గుడ్డు. మంచి ఆరోగ్యం కోసం డాక్టర్లు కచ్చితంగా సూచించే ఆహారం. అయితే కోడిగుడ్డుపై రకరకాల థియరీలు వచ్చాయి. కొందరు కోడిగుడ్డు ఆరోగ్యానికి హాని చేస్తుందని చెబుతుండగా చాలామంది వారంలో కనీసం మూడుసార్లు అయినా కోడిగుడ్డును తీసుకోవాలని చెబుతున్నారు. కోడిగుడ్డు ఆరోగ్యానికి ఏ విధంగా మేలు చేస్తుంది.. ఏ రకంగా కీడు చేస్తుంది..? గుండె పనితీరు మెరుగుపరచడంలో కోడిగుడ్డు ఎలా ఉపయోగపడుతుంది..?

కోడిగుడ్డు పై అధ్యయనం

కోడిగుడ్డు పై ఈ మధ్యే ఓ అధ్యయనం జరిగింది. కోడిగుడ్డు తీసుకోవడం వల్ల గుండె పనితీరు చాలా మెరుగుపడుతుందని తేల్చారు. అయితే వారంలో ఒకటి నుంచి మూడు గుడ్లు తీసుకుంటే గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు సగానికి తగ్గుతాయని ఈ అధ్యయనం తేల్చింది. వారానికి నాలుగు నుంచి ఏడు గుడ్లు తినే 75శాతం మందిలో గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉందని స్టడీ వెల్లడించింది. అయితే మారుతున్న కాలం, జీవనశైలిని దృష్టిలో ఉంచుకుని వారానికి ఒకటి నుంచి మూడు గుడ్లు తినేవారు ఆరోగ్యపరంగా క్షేమంగా సురక్షితంగా ఉంటారని అధ్యయనం వెల్లడించింది. గుడ్లు తీసుకోవడం ద్వారా గుండె పనితీరు బాగా ఉందని స్టడీ తేల్చింది.

గుడ్డుకు గుండెకు సంబంధం ఏంటి..?

గుడ్డుకు గుండెకు ఉన్న సంబంధంపై అధ్యయనం చేయడం జరిగింది. అయితే ఈ అధ్యయనంలో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. దీంతో ఆరోగ్యకరమైన గుండెకు గుడ్లు మంచివా చెడ్డవా అనే చర్చ మొదలైంది. ఆరోగ్యకరమైన వ్యక్తి గుడ్డును మితంగా తీసుకోవడం వల్ల గుండె పనితీరుపై పెద్దగా ప్రభావం చూపలేదని స్టడీలో తేలింది. అయితే గుడ్డును ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నాయని మరికొన్ని స్టడీలు విశ్లేషించాయి. ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు, మధుమేహం ఉన్నవారు గుడ్డును తీసుకోవడం వల్ల ఆ ప్రభావం గుండె పనితీరుపై పడుతుందిన పేర్కొన్నాయి. దీంతో గుడ్డు గుండెకు మంచిదా, హానికరమా అనే చర్చ మరింతగా వ్యాప్తి చెందింది.

గుడ్డు తీసుకునే ఆసియా దేశ ప్రజల ఆరోగ్యం ఎలా ఉంది.?

గుడ్డుకు గుండె పనితీరుకు సంబంధం ఏంటనే దానిపై చాలా అధ్యయనాలు జరిగాయి. ఒక ప్రాంతంలో నివసించే ప్రజలు గుడ్డు తింటే ఫలితం ఒకలా ఉంది. మరొక ప్రాంతంలో నివసించే వారు గుడ్డు తీసుకుంటే ఫలితం మరోలా ఉంది. అయితే ఈ మధ్యే ఆసియా ఖండంలో నివసిస్తూ రోజుకు ఒక గుడ్డు తింటున్న ఆసియా దేశాల ప్రజల్లో గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం తక్కువగా ఉన్నట్లు తమ అధ్యయనంలో వెల్లడైందని వైద్యులు తెలిపారు. గుడ్లలో అనేక రకాల పోషకాహారాలు ఉన్నాయి. మినెరల్స్, విటమిన్స్‌, ఐరన్‌లు ఉన్నాయి. గుడ్లలో విటమిన్ బీ2, బీ12 ఇంకా సెలీనియంలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి గుండె సంబంధిత వ్యాధుల నుంచి కాపాడతాయి. కోడిగుడ్డు శరీరంలో క్రొవ్వును పెంచవని కొన్ని స్టడీలు చెబుతున్నాయి. అంతేకాదు కోడి గుడ్డు తీసుకోవడం వలన కండరాలు బలపడటంతో పాటు శరీర బరువుకు కూడా దోహదపడుతుంది. అదే సమయంలో మెదడు పనితీరు మెరుగుపడుతుందని వైద్యులు చెబుతున్నారు.

గుడ్డులో ఉండే పచ్చ సొన ఆరోగ్యానికి మంచిదా.?

వారంలో మూడు గుడ్డు సొనలు తీసుకోవడం వల్ల మధుమేహం, హృదయ సంబంధిత వ్యాధులను కట్టడి చేసే అవకాశం ఉన్నట్లు ఓ అధ్యయనం ద్వారా వెల్లడైంది. దీంతో వారంలో మూడు గుడ్డు సొనలు తీసుకోవచ్చంటూ 2018లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సిఫారసు చేసింది. గుడ్డు పచ్చసొన యొక్క ప్రయోజనాలు చాలా ఉన్నాయి కానీ నిర్దిష్టంగా చెప్పాలంటే, ఇది విటమిన్ డి మరియు ఐరన్ వంటి ఇతర పోషకాలకు మంచి మూలం అని చెప్పొచ్చు. రోజుకు రెండు నుంచి నాలుగు గుడ్లలోని తెల్ల సొనను తీసుకుంటే మంచిదని వైద్యులు చెబుతున్నారు. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు రోజుకు ఒకటి నుంచి రెండు గుడ్లలో ఉండే తెల్ల సొన మాత్రమే తీసుకుంటే గుండెకు మంచిదని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ పేర్కొంది.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.