టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో 5369 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు...
5369 Central Govt Jobs with Tenth, Inter, Degree qualification... Apply
SSC Recruitment 2023 | Staff Selection Commission is accepting applications for filling up 5369 central government jobs with tenth, inter and degree qualifications.
Alert for Central Govt Jobs aspirants. Staff Selection Commission (SSC) has another job notification. Applications are being accepted for various vacancies. A total of 5369 posts have been announced. Candidates who have passed Tenth, Inter and Degree can apply for these posts. There are posts like Junior Assistant, Junior Engineer, Technical Assistant. Last date to apply for these posts is 27 March 2023. Interested candidates should apply online. Know about this job notification details, important dates, application procedure.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు(Central Govt Jobs) కోరుకునేవారికి అలర్ట్. స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) మరో జాబ్ నోటిఫికేషన్ (Job Notification) వచ్చేసింది. పలు ఖాళీల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. మొత్తం 5369 పోస్టుల్ని ప్రకటించింది. టెన్త్, ఇంటర్, డిగ్రీ పాస్ అయినవారు ఈ పోస్టులకుఅప్లై చేయొచ్చు. జూనియర్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్, టెక్నికల్ అసిస్టెంట్ లాంటి పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 2023 మార్చి 27 చివరి తేదీ. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు, ముఖ్యమైన తేదీలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.
SSC Recruitment 2023: గుర్తుంచుకోవాల్సిన తేదీలు
దరఖాస్తు ప్రారంభం- 2023 మార్చి 6
దరఖాస్తుకు చివరి తేదీ- 2023 మార్చి 27
దరఖాస్తుల కరెక్షన్- 2023 ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 5 వరకు
కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్- 2023 జూన్ లేదా జూలై
SSC Recruitment 2023: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
మొత్తం ఖాళీలు- 5369
విద్యార్హతలు- టెన్త్, ఇంటర్, డిగ్రీ
వయస్సు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు వయోపరిమితి ఉంది. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు- రూ.100. మహిళలు, ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయింపు ఉంటుంది.
SSC Recruitment 2023: రిజిస్ట్రేషన్ చేయండి ఇలా
Step 1- అభ్యర్థులు ముందుగా https://ssc.nic.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
Step 2- హోమ్ పేజీలో New User ? Register Now పైన క్లిక్ చేయాలి.
Step 3- పేరు, పుట్టిన తేదీ, కాంటాక్ట్ వివరాలు ఎంటర్ చేయాలి.
Step 4- ఆ తర్వాత డిక్లరేషన్ ఫిల్ చేయాలి.
Step 5- మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాలి.
Step 6- రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తైన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది.
SSC Recruitment 2023: దరఖాస్తు చేయండి ఇలా
Step 1- రిజిస్ట్రేషన్ పూర్తైన తర్వాత దరఖాస్తు చేయడానికి రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా లాగిన్ కావాలి.
Step 2- లాగిన్ అయిన తర్వాత అభ్యర్థి వివరాలు డిస్‌ప్లేలో కనిపిస్తాయి.
Step 3- ఆ వివరాలన్నీ సరిచూసుకోవాలి. ఏవైనా మార్పులు ఉంటే ఎడిట్ చేయొచ్చు.
Step 4- ఆ తర్వాత కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవెల్-CHSL నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేయాలి.
Step 5- ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.
Step 6- ఫీజు చెల్లించి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి. దరఖాస్తు ఫీజు రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.
గతంలోనే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెబ్‌సైట్‌లో వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ చేసినవారు నేరుగా రెండో పద్ధతి ద్వారా అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయొచ్చు.