India Post GDS 2023: 40,889 jobs in post offices..

India Post GDS 2023: 40,889 jobs in post offices..

India Post GDS 2023: 40,889 jobs in post offices..

India Post GDS Recruitment 2023 : దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో 40,889 గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్‌) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైన విషయం తెలిసిందే. 10వ తరగతిలో సాధించిన మార్కులతో ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు ఎంపికైనవారు బ్రాంచ్‌పోస్టు మాస్టర్‌ (బీపీఎం), అసిస్టెంట్‌బ్రాంచ్‌పోస్టు మాస్టర్‌ (ఏబీపీఎం), డాక్‌ సేవక్‌ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. పోస్టును బట్టి రూ.10,000 నుంచి రూ.12,000 ప్రారంభ వేతనం ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఫిబ్రవరి 16 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఇక.. మొత్తం పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్‌లో 2480, తెలంగాణలో 1266 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు ఎంపికైనవారు రోజుకు నాలుగు గంటలు పనిచేస్తే సరిపోతుంది. వీటితోపాటు ఇండియన్‌ పోస్టల్‌ పేమెంట్‌ బ్యాంకుకు సంబంధించిన సేవలకు గానూ ప్రత్యేకంగా.. ఇన్సెంటివ్‌ రూపంలో బీపీఎం/ ఏబీపీఎం/ డాక్‌ సేవక్‌లకు ప్రోత్సాహం అందిస్తారు. ఆ సేవల విలువ ప్రకారం ఇంటెన్సివ్‌ ఆధారపడి ఉంటుంది. వీరు రోజువారీ విధులు నిర్వర్తించడానికి ల్యాప్‌టాప్‌/ కంప్యూటర్‌/ స్మార్ట్‌ ఫోన్‌ లాంటివి పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ సమకూరుస్తుంది. సంబంధిత కార్యాలయానికి అందుబాటులో నివాసం ఉండాలి. సైకిల్‌ తొక్కడం వచ్చి ఉండాలి.

సర్కిల్ వారీగా ఖాళీలు:

ఆంధ్రప్రదేశ్- 2480

అసోం- 407

బిహార్- 1461

ఛత్తీస్‌గఢ్- 1593

దిల్లీ - 46

గుజరాత్- 2017

హరియాణా- 354

హిమాచల్‌ ప్రదేశ్- 603

జమ్ము అండ్‌ కశ్మీర్- 300

ఝార్ఖండ్- 1590

కర్ణాటక- 3036

కేరళ- 2462

మధ్యప్రదేశ్- 1841

మహారాష్ట్ర- 2508

నార్త్ ఈస్టర్న్- 923

ఒడిశా- 1382

పంజాబ్- 766

రాజస్థాన్- 1684

తమిళనాడు- 3167

తెలంగాణ- 1266

ఉత్తర ప్రదేశ్- 7987

ఉత్తరాఖండ్- 889

పశ్చిమ్‌ బెంగాల్- 2127

ముఖ్య సమాచారం:

అర్హత:10వ తరగతి ఉత్తీర్ణత సాధించినవారై ఉండాలి. ఇందులో మ్యాథ్స్‌, ఇంగ్లిష్‌, స్థానిక భాష ఉండటం తప్పనిసరి. అంటే ఏపీ, తెలంగాణకు చెందినవారు తెలుగు సబ్జెక్టు 10వ తరగతి వరకు చదవడం తప్పనిసరి. కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సైకిల్‌ తొక్కటం వచ్చి ఉండాలి.

వయసు: 16-02-2023 నాటికి 18-40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది.

జీత భత్యాలు: నెలకు బీపీఎం పోస్టులకు రూ.12,000 - రూ.29,380; అలాగే.. ఏబీపీఎం/ డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000 - రూ.24,470 వేతనం ఉంటుంది.

ఎంపిక విధానం: అభ్యర్థులు 10వ తరగతిలో సాధించిన మార్కుల మెరిట్‌ ప్రకారం ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌ఉమెన్‌లకు ఫీజు చెల్లింపు లేదు. మిగిలిన అభ్యర్థులు రూ.100 చెల్లించాలి.

దరఖాస్తు విధానం: దరఖాస్తును ఆన్‌లైన్‌లో సమర్పించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభం: జనవరి 27, 2023.

దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 16, 2023.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌:https://indiapostgdsonline.gov.in/

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.